టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. మొదటి సీజన్‌లోనే విన్నర్‌గా నిలిచారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్‌గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. తెలుగు బిగ్‌బాస్ సీజన్-7లోనూ కంటెస్టెంట్గా పాల్గొన్నారు.
తాజాగా సందీప్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. సందీప్ తన సతీమణి జ్యోతిరాజ్తో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆట సందీప్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నా జీవితంలో ఇది మరచిపోలేని రోజని పోస్ట్ చేశారు. ఆ దేవుడే దిగి వచ్చి మాకు వరం ఇచ్చినట్లుగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఆయనే స్వయంగా ఇంటికి పిలిచి కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారని సందీప్ వెల్లడించారు. ఆ క్షణం నాకు సాక్షాత్ పరమశివుడు ఆశీర్వాదం చేసినట్టుగా అనిపించిందని ఎమోషనలయ్యారు. నా హృదయమంతా ఆనందంతో నిండిపోయిందని ఇన్స్టాలో పంచుకున్నారు.


