మిస్టర్ టవర్ స్టార్..! | 'My best wishes to Tower star Varun' Tweets Allu Sirish | Sakshi
Sakshi News home page

మిస్టర్ టవర్ స్టార్..!

Apr 28 2016 3:54 PM | Updated on Sep 3 2017 10:58 PM

మిస్టర్ టవర్ స్టార్..!

మిస్టర్ టవర్ స్టార్..!

మెగా హీరో వరుణ్ తేజ్ను బావ మరిది అల్లు శిరీష్ 'టవర్ స్టార్' అంటూ ముచ్చటగా పిలుచుకుంటున్నారు.

మెగా హీరో వరుణ్ తేజ్ను బావ మరిది అల్లు శిరీష్ 'టవర్ స్టార్' అంటూ ముచ్చటగా పిలుచుకుంటున్నారు. నిజానికి నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న ఓ ప్రముఖ రియాలిటీ షోలో యాంకర్ ఆయన్ను పదే పదే 'టవర్ స్టార్' అంటూ సంబోధిస్తుంటుంది. ఇప్పుడు అల్లు శిరీష్.. వరుణ్ ని టవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నాడు. ఎత్తు విషయంలో వరుణ్ తండ్రిని మించిపోయాడు మరి!

వరుణ్ తదుపరి చిత్రం 'మిస్టర్' శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా ఎంపిక కాగా హెబ్బా పటేల్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించనుందని టాక్. 'మిస్టర్' టీం మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్తూ అల్లు శిరీష్.. వరుణ్ ని సరదాగా 'టవర్ స్టార్' అంటూ ట్వీట్ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement