సైతాన్ చిత్రంలో సంగీత దర్శకుడు | music director act in sitan movie | Sakshi
Sakshi News home page

సైతాన్ చిత్రంలో సంగీత దర్శకుడు

Aug 23 2014 12:30 AM | Updated on Jun 4 2019 6:45 PM

సైతాన్ చిత్రంలో సంగీత దర్శకుడు - Sakshi

సైతాన్ చిత్రంలో సంగీత దర్శకుడు

సైతాన్ అంటే తెలియని వారుండరు. దుష్ట, దుర్మార్గులను సైతాన్‌తో పోల్చుతారు. అలాంటి సైతాన్ చిత్రంలో సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని నటించనున్నారు.

సైతాన్ అంటే తెలియని వారుండరు. దుష్ట, దుర్మార్గులను సైతాన్‌తో పోల్చుతారు. అలాంటి సైతాన్ చిత్రంలో సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని నటించనున్నారు. నాన్ చిత్రంతో నాయకుడిగా అవతారమెత్తిన ఈయన తాజాగా సలీంగా మారారు. ఈ చిత్రం ఈ నెల 29న తెరపైకి రానుంది. తన మరణం తథ్యం అని తెలియడంతో ఒక్క రోజు అయినా తాను కోరుకున్న ప్రకారం జీవించాలని ఆశించే ఒక యువకుడి ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం సలీం.
 
ఇందులో వైద్యుడిగా నటించిన విజయ్ ఆంటోని సరసన తెలుగమ్మాయి అక్షా నటించారు. భారతిరాజా శిష్యుడు నిర్మల్‌కుమార్ దర్శకుడు. చిత్రానికి తానే సంగీతాన్ని అందించి శ్రీ గ్రీన్ స్టూడియో సంస్థతో కలిసి విజయ్ ఆంటోని నిర్మించారు. కాగా తదుపరి ఈయన మరో రెండు చిత్రాలలో నటించడానికి రెడీ అవుతున్నారు. అందులో ఒకటి ఇండియా పాకిస్థాన్. ఇందులో విజయ్ ఆంటోనికి జంటగా సుష్మా నటించనున్నారు.  ఈ చిత్రానికి ధనశేఖర్ అనే నూతన సంగీత దర్శకుడు పని చేయడం విశేషం. దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడు ఆనంద్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తదుపరి విజయ్ ఆంటోని నటించనున్న చిత్రానికి సైతాన్ అనే పేరును నిర్ణయించారు. ఇది హార్రర్ కథా చిత్రంగా తెరకెక్కనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement