త్రీ కజిన్స్‌.. వన్‌ బ్రదర్‌ ఓకే! | Multi-starrer for Praveen Sattaru | Sakshi
Sakshi News home page

త్రీ కజిన్స్‌.. వన్‌ బ్రదర్‌ ఓకే!

Dec 9 2017 12:35 AM | Updated on Aug 11 2019 12:52 PM

Multi-starrer for Praveen Sattaru - Sakshi

నితిన్‌–రానా–నారా రోహిత్‌ కజిన్స్‌గా నటించనున్నారా? ‘పీఎస్వీ గరుడ వేగ’ హిట్‌ జోష్‌లో ఉన్న దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా తీయనున్నారా? ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో ఇదే హాట్‌ టాపిక్‌. నితిన్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా ఆల్రెడీ షురూ అయిన విషయం తెలిసిందే. ఇది మల్టీస్టారర్‌ మూవీ అని, ఇందులో రానా, నారా రోహిత్‌ నటించనున్నారనే వార్త షికారు చేస్తోంది. ఈ విషయం గురించి ప్రవీణ్‌ సత్తారుని ‘సాక్షి’ సంప్రదించగా.. ‘‘మల్టీస్టారర్‌ మూవీ చేయబోతున్నానన్నది నిజమే.

విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. కథ రెడీ. ఇందులో ముగ్గురు హీరోలుంటారు. వారిలో నితిన్‌ ఒక్కరే ఫైనల్‌. నితిన్‌కి మాత్రమే కథ వినిపించాను. రానా, నారా రోహిత్‌ నటిస్తున్నారన్నది నిజం కాదు. ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. టైటిల్‌ ఇంకా ఏమీ అనుకోలేదు. కొత్త ఏడాదిలో సినిమా సెట్స్‌పైకి వెళుతుంది’’ అన్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌లో ఈ సినిమా రూపొందనుంది. కాగా, ఈ చిత్రానికి ‘3 కజిన్స్‌’ టైటిల్‌ ఫిక్స్‌ చేశారని టాక్‌. త్రీ కజిన్స్‌ అంటే హీరోయిన్స్‌ పాయింటాఫ్‌ వ్యూలోనూ ఉండొచ్చు. అయితే.. ఈ టైటిల్‌ హీరోలను ఉద్దేశించి ఫిక్స్‌ చేసినదే అని భోగట్టా.

Advertisement
 
Advertisement
Advertisement