శమంతకమణా.. ఆవిడెవరు సార్..! | Multi Starer Film Shamantakamani teaser | Sakshi
Sakshi News home page

శమంతకమణా.. ఆవిడెవరు సార్..!

Jun 15 2017 11:40 AM | Updated on Aug 29 2018 3:53 PM

యంగ్ హీరోస్ నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుదీర్ బాబులు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్

యంగ్ హీరోస్ నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుదీర్ బాబులు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ శమంతకమణి. గతంలో ఎన్నడూ లేని విధంగా నలుగురు యంగ్ హీరోస్ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ పోస్టర్ లో మరింత హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్ తాజాగా టీజర్ తో మరోసారి ఆకట్టుకుంది.  శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మెకానిక్ మహేష్ బాబుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాపై మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement