యంజీఆర్‌ – యంఆర్‌ రాధల కథేంటి?

M.R Radha Really Shoot MGR - Sakshi

తమిళ సినీ చరిత్రలో యంజీఆర్‌ను యంఆర్‌ రాధా తుపాకితో కాల్చడం పెద్ద సంచలనంతో పాటు మిస్టరీ. ఈ సంఘటన తమిళ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోనిది, ఎప్పుడూ  చర్చ జరిగే టాపిక్‌. ఈ కాల్పుల్లో యంజీఆర్‌ తన గొంతును కోల్పోవడం, ఆ తర్వాత మాటల్లో స్పష్టత లోపించడం తమిళ ప్రేక్షకులకు తెలుసు. ఎంజీఆర్‌ను కాల్చిన సంఘటనలో రాధా అరెస్ట్‌ కావడం తెలిసిందే.  ఇప్పుడు ఆ సంఘటన వెనక ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుందని తమిళ ప్రే„ý కులు భావిస్తున్నారు. దానికి కారణం.. యంఆర్‌ రాధా మీద ఓ బయోపిక్‌ రూపొందనుండటమే.

నటి, యంఆర్‌ రాధ కుమార్తె రాధిక తన సొంత బ్యానర్‌ రధన్‌ మీడియా వర్క్స్‌పై ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. రాధా మనవడు ఐకీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో రాధ పాత్రలో శింబు, యంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేసినట్టు సమాచారం. గత ఏడాదే మణిరత్నం ‘చెక్క చివంద వానమ్‌’ (తెలుగులో నవాబ్‌) సినిమాలో అరవింద స్వామి, శింబు అన్నదమ్ములుగా యాక్ట్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ మరోసారి కలసి నటించబోతున్నారన్న మాట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top