రూ.1837 కోట్ల ఖర్చుతో ‘నో టైమ్‌ టు డై’ చిత్రం

Most Expensive Jamesbond Film No Time To Die - Sakshi

డేనియల్‌ క్రేగ్‌ నటించిన ‘నో టైమ్‌ టు డై’  హాలీవుడ్‌ జేమ్స్‌ బాండ్‌ చిత్ర నిర్మాణానికి ఇంతవరకు వచ్చిన అన్ని బాండ్‌ చిత్రాలకన్నా ఎక్కువ ఖర్చు అయిందట. డేనియల్‌ క్రేగ్‌ నటించిన ‘స్పెక్టర్‌’కు అత్యధికంగా 182 మిలియన్‌ పౌండ్లు ఖర్చుకాగా, ‘స్కైఫాల్‌’ చిత్రానికి 138 మిలియన్‌ పౌండ్లు ఖర్చు కాగా తాజా చిత్రం ‘నో టైమ్‌ టు డై’ నిర్మాణానికి 200 మిలియన్‌ పౌండ్లు (దాదాపు 1837 కోట్ల రూపాయలు ) ఖర్చయ్యాయని చిత్ర నిర్మాణ సంస్థ ‘బీ 25’ తాజాగా వెల్లడించింది. 

ఏప్రిల్‌ నెలలో విడుదల కావాల్సిన ‘నో టైమ్‌ టు డై’ చిత్రం కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా డిసెంబర్‌ నెలకు వాయిదా పడింది. జేమ్స్‌ బాండ్‌గా డేనియల్‌ క్రేగ్‌ నటించిన మొదటి చిత్రం ‘స్కైఫాల్‌’కాగా, ఆ తర్వాత వరుసగా క్యాసినో రాయల్, క్వాంటమ్‌ ఆఫ్‌ సొలేస్, స్పెక్టర్‌ చిత్రాల్లో నటించారు. నో టైమ్‌ టు డై ఆయన ఐదవ చిత్రం. 

శియాన్‌ క్యానరీ నటించిన తొలి జేమ్స్‌ బాండ్‌ చిత్రం ‘డోర్‌ నెం.’ నిర్మాణానికి 1962లో 800కే పౌండ్లు (దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు) ఖర్చుకాగా ఇప్పుడు 200 మిలియన్‌ పౌండ్లు ఖర్చవడం విశేషమని హాలీవుడ్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి నో టైమ్‌ టు డై చిత్ర నిర్మాణానికి మరో 47 పౌండ్లు ఖర్చు అయ్యేవని, హాలీవుడ్‌ స్టూడియోలు రాయితీలు ఇవ్వడం ఈ మేరకు ఖర్చు తగ్గిందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top