jamesbond
-
‘నో టైమ్ టు డై’ వెరీ కాస్ట్లీ గురూ..
డేనియల్ క్రేగ్ నటించిన ‘నో టైమ్ టు డై’ హాలీవుడ్ జేమ్స్ బాండ్ చిత్ర నిర్మాణానికి ఇంతవరకు వచ్చిన అన్ని బాండ్ చిత్రాలకన్నా ఎక్కువ ఖర్చు అయిందట. డేనియల్ క్రేగ్ నటించిన ‘స్పెక్టర్’కు అత్యధికంగా 182 మిలియన్ పౌండ్లు ఖర్చుకాగా, ‘స్కైఫాల్’ చిత్రానికి 138 మిలియన్ పౌండ్లు ఖర్చు కాగా తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ నిర్మాణానికి 200 మిలియన్ పౌండ్లు (దాదాపు 1837 కోట్ల రూపాయలు ) ఖర్చయ్యాయని చిత్ర నిర్మాణ సంస్థ ‘బీ 25’ తాజాగా వెల్లడించింది. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ‘నో టైమ్ టు డై’ చిత్రం కరోనా వైరస్ విజృంభణ కారణంగా డిసెంబర్ నెలకు వాయిదా పడింది. జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటించిన మొదటి చిత్రం ‘స్కైఫాల్’కాగా, ఆ తర్వాత వరుసగా క్యాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సొలేస్, స్పెక్టర్ చిత్రాల్లో నటించారు. నో టైమ్ టు డై ఆయన ఐదవ చిత్రం. శియాన్ క్యానరీ నటించిన తొలి జేమ్స్ బాండ్ చిత్రం ‘డోర్ నెం.’ నిర్మాణానికి 1962లో 800కే పౌండ్లు (దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు) ఖర్చుకాగా ఇప్పుడు 200 మిలియన్ పౌండ్లు ఖర్చవడం విశేషమని హాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి నో టైమ్ టు డై చిత్ర నిర్మాణానికి మరో 47 పౌండ్లు ఖర్చు అయ్యేవని, హాలీవుడ్ స్టూడియోలు రాయితీలు ఇవ్వడం ఈ మేరకు ఖర్చు తగ్గిందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. -
స్పెషల్ బాండ్.. స్పెషల్ డైరెక్టర్!
బాండ్.. జేమ్స్‌బాండ్. 56 సంవత్సరాల బ్రాండ్ అది. 24 సినిమాల ఎంటర్టైన్మెంట్. ఎంతో మంది దర్శకులు మారిపోయారు. ఎంతో మంది నటులూ మారిపోయారు. ఆ బ్రాండ్ ఇప్పటికీ అలాగే ఉంది. బాండ్ సినిమా వస్తోందంటే యాక్షన్ సినిమా అభిమానులకు పండగే. ఇక ఈసారి వచ్చేది 25వ సినిమా కదా! కాబట్టి ఈ స్పెషల్ బాండ్ సెట్స్‌పైకి వెళ్లకముందు నుంచే రోజూ వార్తల్లో కనిపిస్తోంది. ఇంతకుముందు నేటితరం టాప్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నోలన్ బాండ్ 25వ సినిమాకు డైరెక్టర్ అని వినిపించింది. ఆ తర్వాత వరుసగా టాప్ డైరెక్టర్స్ పేర్లన్నీ ఒక్కొక్కటిగా వినిపిస్తూ వచ్చాయి. ఇక ఎట్టకేలకు స్పెషల్ బాండ్ దర్శకుడు ఫిక్స్ అయిపోయాడు. ఆయనే మన డేనీ బోయల్. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘127 అవర్స్’ సినిమాలతో ఇండియన్ సినిమా అభిమానులకూ బాగా దగ్గరైన డేనీ, జేమ్స్‌బాండ్ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని స్వయంగా ప్రకటించాడు. ఇప్పుడే అసలైన చర్చ మొదలైంది. డ్రామా, థ్రిల్లర్ జానర్‌కు పెట్టింది పేరైన డేనీ బోయల్, బాండ్ లాంటి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడా అన్నది ఆసక్తికరం.ఇప్పటికే దర్శకులు మారినప్పుడల్లా బాండ్ సినిమా ప్లాట్, కోర్ ఎమోషన్, టోన్ మారిపోతూ వచ్చింది. ముఖ్యంగా స్కై ఫాల్, స్పెక్టర్ సినిమాలతో శామ్ మెండిస్ బాండ్ రూపు రేఖలనే మార్చేశాడు. దీంతో ఇప్పుడు కొత్తగా, అదీ స్పెషల్ సినిమాకు, ఈ స్పెషల్ డైరెక్టర్ డేని బోయల్ ఏ టోన్ పట్టుకొస్తాడో చూడాలి. గత నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాలకు హీరో అయిన డేనియల్ క్రెయిగ్ ఈ సినిమాలోనూ నటిస్తున్నాడు. -
జేమ్స్‌బాండ్ ఎవరో అర్థమైందా...
గాంధీనగర్ : ‘జేమ్స్‌బాండ్’ అల్లరి నరేష్ నగరంలో సందడి చేశాడు. థియేటర్లో ప్రత్యక్షమై నవ్వులు పూయించాడు. తాను జేమ్స్‌బాండ్ కాదంటూ తన భార్య అంటూ తనదైన శైలిలో డైలాగులు చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జేమ్స్‌బాండ్ చిత్ర విజయోత్సవంలో భాగంగా యూనిట్ సభ్యులు మంగళవారం నగరంలోని అన్నపూర్ణ థియేటర్‌కు చేరుకుని సందడి చేశారు. ప్రేక్షకుల కోరిక మేరకు అల్లరి నరేష్ చిత్రంలోని డైలాగులు చెప్పారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ హాస్య చిత్రలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని ప్రేక్షకులు మరోసారి నిరూపించారన్నారు. చిత్రం టైటిల్ కథానాయిక పాత్రతో ముడిపడి ఉందన్నారు. చిత్రం ఆద్యంతం హాస్యభరితంగా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా చిత్రం చూసేలా చిత్రాన్ని దర్శకులు తెరకెక్కించారన్నారు. జేమ్స్‌బాండ్ ఎవరో అర్థమైందా.. అంటూ ప్రేక్షకులను ప్రశ్నించారు. తన చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కథానాయిక సాక్షిచౌదరి, నటులు పృథ్వీరాజ్, హేమ, నిర్మాతలు సుంకర రామబ్రహ్మం, అనీల్, కెమెరామెన్ రాము, పంపిణీదారులు సర్వేశ్వరరావు, అన్నపూర్ణ థియేటర్ అధినేత పెద్దబాబు పాల్గొన్నారు. -
గుమ్మడికాయ కొట్టిన అల్లరోడి చిత్రయూనిట్
-
'నన్ను బాండ్ లేడీ అనే పిలవండి'
తనను బాండ్ లేడీ అని పిలిస్తేనే ఇష్టంగా ఉంటుందని హాలీవుడ్ నటి మోనికా బెల్లుస్సీ(50) అంటున్నారు. ఆమె జేమ్స్ బాండ్ చిత్రం 'స్పెక్ట్రం'లో హీరోయిన్గా నటించనున్నారు. ఈ చిత్రంలో డానియెల్ క్రేగ్ (46) హీరోగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో బాండ్ గర్ల్ అనే పేరు తనకు సరిగ్గా సరిపోదని, అలా ఎవరైనా పిలవడం కూడా ఇష్టం ఉండదని అంటున్నారామె. ఈ చిత్ర దర్శకుడు శ్యామ్ మెండీస్ బాండ్ గర్ల్ అని పిలిచినప్పటి నుంచి యాబై ఏళ్ల ప్రాయంలో తాను గర్ల్ ఏమిటి అనే ప్రశ్న తన బుర్రను తొలుస్తుందని మోనికా చెప్తున్నారు. గతంలో బాండ్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లందరికన్నా తాను పెద్దదానినని, బాండ్ లేడీ అని పిలవడమే కరెక్ట్ అని అంటున్నారు.