బ్యాచ్‌లర్‌ వచ్చేశాడు

Most Eligible Bachelor movie first look release - Sakshi

అఖిల్‌ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘‘హైదరాబాద్, అమెరికా లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెల 15నుంచి కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నాం. ఈ షెడ్యూల్‌తో మేజర్‌ టాకీపార్టు పూర్తవుతుంది. ఇందులో ఉన్న 6 పాటల్లో 4 పాటలను పూర్తి చేశాం. మిగతా రెండు పాటలను ఫారిన్‌లో షూట్‌ చేస్తాం. సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి గోపీసుందర్‌ స్వరకర్త.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top