మొహెంజొదారో ఫస్ట్ లుక్ విడుదల | Mohenjo Daro first look released | Sakshi
Sakshi News home page

మొహెంజొదారో ఫస్ట్ లుక్ విడుదల

Jun 8 2016 11:15 AM | Updated on Sep 4 2017 2:00 AM

మొహెంజొదారో ఫస్ట్ లుక్ విడుదల

మొహెంజొదారో ఫస్ట్ లుక్ విడుదల

బాలీవుడ్ మ్యాన్లీ హంక్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా మొహెంజొదారో. క్రీస్తూ పూర్వం విలసిల్లిన నాగరికతకు సంబందించిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు...

బాలీవుడ్ మ్యాన్లీ హంక్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా మొహెంజొదారో. క్రీస్తూ పూర్వం విలసిల్లిన నాగరికతకు సంబందించిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లగాన్ ఫేం అశుతోష్ గోవరికర్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్తో పాటు హృతిక్ లుక్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్నూ రిలీజ్ చేశారు.

రఫ్ లుక్లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో కనిపిస్తున్న హృతిక్ మరోసారి ఆకట్టుకున్నాడు. తన ట్విట్టర్లో మొహెంజొదారో పోస్టర్ను రిలీజ్ చేసిన హృతిక్, తన పాత్ర పేరు సార్మాన్ అంటూ ప్రకటించాడు. ప్రేమ, శక్తిలకు ప్రతిరూపం సార్మాన్ అంటూ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు హృతిక్. ఈ సినిమాలో ముకుందా ఫేం పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement