సైలెంట్‌గా.. హిట్‌ ఖాయం

mohanbabu gayathri movie shooting in hyderabad - Sakshi

మోహన్‌బాబుకు కూతురంటే ఎంతో ప్రేమ... రియల్‌ లైఫ్‌లో ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది! ఇప్పుడు రీల్‌ లైఫ్‌లోనూ కొంచెం అటువంటి పాత్రనే పోషిస్తున్నారట! కొంత విరామం తర్వాత మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘గాయత్రి’. ‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్‌ మదన్‌ దర్శకుడు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. మొన్న జూలైలో షూటింగ్‌ మొదలైంది. అప్పటి నుంచి సైలెంట్‌గా షూట్‌ కానిచ్చేస్తున్నారు.ఒక్క మేటర్‌ కూడా బయటకు రానివ్వడం లేదు.

అసలు సిన్మా కథ ఏంటని ఆరా తీస్తే... ఇందులో కూతురిపై ఎంతో ప్రేమ గల తండ్రిగా మోహన్‌బాబు, ఆయన కుమార్తెగా ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్‌ నిఖిలా విమల్‌ నటిస్తున్నారని తెలిసింది. కూతురి కోసం తండ్రి ఏం చేశాడనేది కథ అట!! వెరీ హై ఇంటెన్స్‌ ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అట! విలువలతో పాటు కమర్షియల్‌ అంశాలు ఉన్నాయని సమాచారం! స్ట్రాంగ్‌ కంటెంట్‌కి గ్రేట్‌ యాక్టర్‌ మోహన్‌బాబు తోడవడంతో టీమంతా పెద్ద హిట్‌ కొట్టబోతున్నామని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. షూటింగులో కొన్ని సీన్లు చూసినోళ్లు కూడా అదే మాట చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. నాగినీడు, ‘సత్యం’ రాజేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ: చిన్నా, ఫైట్స్‌: కనల్‌ కణ్ణన్, కెమెరా: సర్వేష్‌ మురారి, సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top