‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ కి మోహన్‌బాబు విషెస్‌ | Mohan Babu Wishes To NTR Biopic Cinema | Sakshi
Sakshi News home page

Jan 9 2019 11:21 AM | Updated on Jan 9 2019 12:17 PM

Mohan Babu Wishes To NTR Biopic Cinema - Sakshi

బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో క్రిష్‌ తెరకెక్కించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్‌ బుధవారం విడులైంది. భారీ స్థాయిలో రిలీజైన ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఆకాక్షించారు. కొన్ని యాంగిల్స్‌లో బాలయ్య తండ్రి పోలికలతో ఉండడం అద్భుత విషయమని పేర్కొన్నారు.

‘మంచి దర్శకుడి చేతిలో సినిమా రూపొందడం, స్వయంగా నిర్మిస్తూ ప్రధాన పాత్ర పోషించడం కూడా అద్భుతం, అమోఘం’ అని బాలయ్యను ప్రశంసించారు మోహన్‌బాబు. ‘అన్నగారి బయోపిక్‌ తీయడం.. అందులోనూ మహానటుని కుమారుడు బాలయ్య తండ్రి పాత్ర పోషించడం మామూలు విషయం కాదని’ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement