మణిరత్నం మెచ్చుకున్నారు! | Mirzya actor Saiyami Kher's film with Mani Ratnam gets delayed | Sakshi
Sakshi News home page

మణిరత్నం మెచ్చుకున్నారు!

Jul 19 2016 11:58 PM | Updated on Apr 3 2019 6:34 PM

మణిరత్నం మెచ్చుకున్నారు! - Sakshi

మణిరత్నం మెచ్చుకున్నారు!

అనుకోని అద్భుతాలు జరిగినప్పుడు ‘తంతే బూరెల బుట్టలో పడ్డట్లు..’, ‘రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు..’ అంటారు. ‘రేయ్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన

అనుకోని అద్భుతాలు జరిగినప్పుడు ‘తంతే బూరెల బుట్టలో పడ్డట్లు..’, ‘రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు..’ అంటారు. ‘రేయ్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ సయామీ ఖేర్‌కి సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ప్రముఖ నటి షబానా ఆజ్మీ మేనకోడలు సయామి. మేనత్తలానే సయామి అందగత్తె. బాగా నటించగలరు కూడా.
 
  మణిరత్నంలాంటి దర్శకులు ఏ ఆర్టిస్ట్‌లో ఎంత ప్రతిభ ఉందో చూడగానే చెప్పేయగలుగుతున్నారు. ఓ సందర్భంలో సయామీని చూసి, కథానాయికగా తీసుకోవాలనుకున్నారట. ఆ విషయం గురించి సయామీ ఖేర్ చెబుతూ - ‘‘మణిరత్నం సార్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఓ రోజు ఆయన ఆఫీసు నుంచి ఫోన్ వస్తే, వెళ్లాను. స్క్రీన్ టెస్ట్ చేశారు.
 
  మణి సార్‌కి నచ్చింది. నా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని మెచ్చుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తాను తీయాలనుకున్న సినిమాలో కథానాయికగా తీసుకుంటా నన్నారు. కానీ, నా దురదృష్టమో ఏమో ఆ సినిమా ఆరంభం కావడానికి ఆలస్యం అయింది. ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తారని అనుకుంటున్నా. ఏం జరుగుతోంది చూడాలి’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement