‘మా నమ్మకం నిజమైంది’ | metro movie success meet | Sakshi
Sakshi News home page

‘మా నమ్మకం నిజమైంది’

Mar 19 2017 11:55 PM | Updated on Oct 16 2018 5:14 PM

‘మా నమ్మకం నిజమైంది’ - Sakshi

‘మా నమ్మకం నిజమైంది’

‘‘ప్రేమిస్తే, జర్నీ, సలీమ్‌ తరహాలో చాలా రోజుల తర్వాత ‘మెట్రో’ తో మంచి విజయం అందుకున్నాం.

‘‘ప్రేమిస్తే, జర్నీ, సలీమ్‌ తరహాలో చాలా రోజుల తర్వాత ‘మెట్రో’ తో మంచి విజయం అందుకున్నాం. మంచి కథాంశం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి మా విషయంలో ప్రూవ్‌ అయింది. ఈ చిత్రం విజయంపై ‘చుట్టాలబ్బాయి’ నిర్మాత రజనీ రామ్, నేను పెట్టుకున్న నమ్మకం నిజమైంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని సురేశ్‌ కొండేటి అన్నారు.

ఆనంద్‌ కృష్ణ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘మెట్రో’ చిత్రాన్ని సురేశ్‌ కొండేటి సమర్పణలో రజనీ తాళ్లూరి అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నా మొదటి చిత్రం తెలుగు, తమిళంలో ఘన విజయం సాధించడం హ్యాపీ. ప్రస్తుతం ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీ రెడీ చేస్తున్నా. తెలుగులో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి కథాంశం ఉన్న సినిమాలో నటించే అవకాశం తొలి చిత్రానికే  రావడం ఆనందంగా ఉంది’’ అని హీరో శిరీష్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement