
హైదరాబాద్ వేదికగా 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఇటీవల సంతోషం అధినేత సురేశ్ కొండేటి నిర్వహించారు. ఈ వేడుకలో మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు (మోహన్ బాబు, విష్ణు, అవ్రామ్) తో పాటు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్వనీదత్, మురళీ మోహన్, కాట్రగడ్డ ప్రసాద్, నటీనటులు మాలాశ్రీ, బాబు మోహన్ వంటి పలువురు పాల్గొన్నారు. ఈ వేదికపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు అవ్రామ్‌తో సహా పలువురు అవార్డులు అందుకున్నారు.
వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారికి ఘన సన్మానం చేశారు. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేశారు. కోట శ్రీనివాసరావు స్మారక అవార్డు బాబు మోహన్ అందుకున్నారు. ఇటీవలే పాటల రచయితగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాస్కర భట్ల రవికుమార్ కు కూడా ఘన సన్మానం జరిగింది., అనంత శ్రీరామ్, (కన్నడ) ఆరాధన రామ్, మాలాశ్రీ గారి కుమార్తె (తమిళం) నిధిలం స్వామినాథన్ గార్లు మురళీ మోహన్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు.
నటుడు అజయ్ ఘోష్, నటి శరణ్య ప్రదీప్, సింగర్ కీర్తన శర్మ, డాన్స్ మాస్టర్ విజయ్ పొలంకి, హీరో చంద్ర హాస్, సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి, డైరెక్టర్ యాదు వంశీ, మధుప్రియ, హీరో శివాజీ, డైలాగ్ రైటర్ ఆకెల్ల శివప్రసాద్, 7 హిల్స్ ప్రొడ్యూసర్ సతీష్, రేవు మూవీ ప్రొడ్యూసర్ మురళీ గింజుపల్లి మొదలైన వారు బాబు మోహన్ చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు.