ఓసారి మా వీధికి రారాదా! | Met Gala 2017: Priyanka walks the red carpet in trench coat, Twitter can’t stop laughing | Sakshi
Sakshi News home page

ఓసారి మా వీధికి రారాదా!

May 2 2017 3:04 PM | Updated on Apr 3 2019 9:13 PM

ఓసారి మా వీధికి రారాదా! - Sakshi

ఓసారి మా వీధికి రారాదా!

‘మేడమ్‌ ఒక్కటంటే ఒక్కసారి మన స్ట్రీట్‌కొస్తే బాగుంటుంది. మొత్తం వీధి వీధంతా క్లీన్‌ అయిపోతుంది’. ప్రియాంకా చోప్రా వేసుకున్న పొడవాటి గౌను చూసి, చాలామంది వేసుకున్న జోక్‌ ఇది.

‘మేడమ్‌ ఒక్కటంటే ఒక్కసారి మన స్ట్రీట్‌కొస్తే బాగుంటుంది. మొత్తం వీధి వీధంతా క్లీన్‌ అయిపోతుంది’. ప్రియాంకా చోప్రా వేసుకున్న పొడవాటి గౌను చూసి, చాలామంది వేసుకున్న జోక్‌ ఇది. ఫొటోలో కనిపిస్తోన్న గౌనుని చూశాక ఎవరైనా ఇలానే అంటారు. ఇంతకీ ఈ బ్యూటీ ఇంత లాంగ్‌ ఫ్రాక్‌ ఎందుకు వేసుకున్నారు? అనే విషయానికి వస్తే... న్యూయార్క్‌లో జరిగిన ‘కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గాలా’గా చెప్పుకునే ‘మెట్‌గాలా–2017’ కోసమే. ఇక్కడికి వివిధ దేశాల స్టార్లు విభిన్న రకాల కాస్ట్యూమ్స్‌ ధరించి వస్తారు. అలాగే ప్రియాంక చోప్రా కూడా ఈ డిఫరెంట్‌ లుక్‌తో అందర్నీ ఆకర్షించారు.

ఇక... ఈవిడగారి ఫ్రాక్‌ గురించి వచ్చిన మరికొన్ని జోకులేంటంటే... ‘‘ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వర్షాల బెడద ఉందన్న భయం వద్దు. ప్రియాంక ఒక్కరే గ్రౌండ్‌ మొత్తాన్ని కవర్‌ చేయగలరు’’ అని ఒకరు సరదాగా అంటే ‘‘స్వచ్ఛభారత్‌ అభియాన్‌లో భాగంగా ప్రియాంకచోప్రా డ్రెస్‌ను డిజైన్‌ చేశారు. పీఎమ్‌ మోదీకి ఆమె మంచి ఐడియా ఇచ్చారు’’  అని ఇంకొకరు ట్వీట్‌ చేశారు. ఇలా బోల్డన్ని జోక్స్‌ మంగళవారం హల్‌చల్‌ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement