గాంధీతో సినిమా చేస్తాడట..? | Merlapaka Gandhi To Direct Ram Charan ? | Sakshi
Sakshi News home page

గాంధీతో సినిమా చేస్తాడట..?

Jan 20 2016 2:48 PM | Updated on Sep 3 2017 3:59 PM

గాంధీతో సినిమా చేస్తాడట..?

గాంధీతో సినిమా చేస్తాడట..?

'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ. తొలి సినిమాతోనే ఘనవిజయం సాధించిన గాంధీ, ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేశాడు. శర్వానంద్ హీరోగా...

'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ. తొలి సినిమాతోనే ఘనవిజయం సాధించిన గాంధీ, ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేశాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన 'ఎక్స్ప్రెస్ రాజా' సంక్రాంతి బరిలో భారీ సినిమాలతో పోటి పడి కూడా మంచి విజయం సాధించింది. దీంతో ఇప్పుడు స్టార్ హీరోలు కూడా మేర్లపాక గాంధీతో సినిమాకు రెడీ అవుతున్నారు.

ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఈ లిస్ట్లో అందరి కంటే ముందున్నాడు. ఇప్పటికే ఎక్స్ప్రెస్ రాజా సినిమాపై పాజిటివ్గా స్పందించిన చెర్రీ, మంచి కథ రెడీ చేస్తే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం తనీ ఒరువన్ రీమేక్గా రూపొందనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్న చరణ్, ఆ సినిమా పూర్తయ్యే లోపు మరో సినిమాను లైన్లో పెట్టాలని భావిస్తున్నాడు. మరి  గాంధీ మూడో సినిమా చరణ్తోనే ఉంటుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement