పెళ్లిచూపులు తరువాత మెంటల్ మదిలో | Mental Madilo Sri Vishnu Raj Kandukuri Film | Sakshi
Sakshi News home page

పెళ్లిచూపులు తరువాత మెంటల్ మదిలో

Mar 28 2017 1:15 PM | Updated on Sep 5 2017 7:20 AM

పెళ్లిచూపులు తరువాత మెంటల్ మదిలో

పెళ్లిచూపులు తరువాత మెంటల్ మదిలో

పెళ్లిచూపులు సినిమాతో బిగ్ హిట్ అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో ఇంట్రస్టింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

పెళ్లిచూపులు సినిమాతో బిగ్ హిట్ అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో ఇంట్రస్టింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెళ్లిచూపులు తరహాలోనే 'మెంటల్ మదిలో' పేరుతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో నటుడిగా మంచి మార్కులు సాధించిన శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నాడు.

నివేథ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రీవిష్ణు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేన్ లా కనిపిస్తున్నాడు. కథ ఎపింకలో కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్న శ్రీవిష్ణు ఈ సినిమాతో మరో విజయం అందుకుంటానన్న నమ్మకంతో ఉన్నాడు. పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండటం సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement