బాలీవుడ్‌ కాలింగ్‌ | Megha Akash roped in to romance Sooraj Pancholi in Irfan Kamal’s next | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ కాలింగ్‌

Sep 30 2018 5:49 AM | Updated on Apr 3 2019 6:34 PM

Megha Akash roped in to romance Sooraj Pancholi in Irfan Kamal’s next - Sakshi

మేఘా ఆకాష్‌


కథానాయికగా సౌత్‌లో మంచి పేరు సంపాదించుకుని కొత్త కొత్త ఆఫర్లను చేజిక్కించుకుంటున్నారు చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్‌. ఇప్పుడామె నార్త్‌ సైడ్‌ కన్నేశారు. అవును... మేఘా ఆకాష్‌కు బాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. సూరజ్‌ పాంచోలి హీరోగా ఇర్ఫాన్‌ కమల్‌ దర్శకత్వంలో హిందీలో రూపొందుతున్న సినిమా ‘శాటిలైట్‌ శంకర్‌’. ఇందులోనే కథానాయికగా ఎంపికయ్యారు మేఘా ఆకాశ్‌. ఇంతకుముందు ‘థ్యాంక్స్‌ మా’ చిత్రానికి దర్శకునిగా వర్క్‌ చేశారు కమల్‌. ‘‘బాలీవుడ్‌ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా విభిన్నమైనది. పెద్ధ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇందులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని మేఘా ఆకాష్‌ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు మేఘా ఆకాష్‌ అయితే సరిగ్గా సరిపోతారని ఆమెను ఎంపిక చేయడం జరిగింది’’ అన్నారు దర్శకుడు కమల్‌. ఈ సంగతి ఇలా ఉంచితే.. లై, ఛల్‌ మోహన్‌రంగ సినిమాలతో తెలుగు తెరపై మెరిసిన మేఘా ఇప్పుడు తమిళంలో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న ‘పేట్టా’ సినిమాలో ఓ కీలక రోల్‌ చేస్తున్నారు. అలాగే ధనుష్‌ హీరోగా నటించిన ‘ఎన్నై నోక్కి పాయుమ్‌ తోట్టా’ తమిళంలో మేఘా నెక్ట్స్‌ రిలీజ్‌. ఈ చిత్రాలే కాకుండా మరో రెండు రెండు తమిళ ప్రాజెక్ట్‌లు మేఘా బ్యాంక్‌లో ఉన్నాయి. ఇలా మేఘా బిజీ బిజీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement