రాజమండ్రిలో కలుద్దాం

Megastar Chiranjeevi next movie is Acharya Shooting Updates - Sakshi

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్రలో కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్‌ పాత్ర నక్సలైట్‌ లీడర్‌గా ఉంటుందట. రాజమండ్రిలో జరగబోయే ఈ సినిమా షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌ కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. చిరంజీవి చిన్నప్పటి పాత్రను చరణ్‌ చేస్తున్నారని టాక్‌. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నారా?
మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘లూసీఫర్‌’ తెలుగు రీమేక్‌ రైట్స్‌ రామ్‌చరణ్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా ఆ సినిమా తెరకెక్కించనున్నారు. తాజాగా మరో మలయాళ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ తెలుగు రీమేక్‌ రైట్స్‌ను చరణ్‌ కొనుగోలు చేశారని టాక్‌. మరి ఈ రీమేక్‌లో చిరు కనిపిస్తారా? చరణ్‌ నటిస్తారా? తెలియాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top