మెగాస్టార్ మెగా రికార్డ్ | Mega Star Chiranjeevi Khaidi Number 150 record | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ మెగా రికార్డ్

Jan 29 2017 11:48 AM | Updated on Sep 5 2017 2:25 AM

మెగాస్టార్ మెగా రికార్డ్

మెగాస్టార్ మెగా రికార్డ్

రీ ఎంట్రీలో మెగాస్టార్ రికార్డ్ల హవా కొనసాగుతోంది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ మీద తన

రీ ఎంట్రీలో మెగాస్టార్ రికార్డ్ల హవా కొనసాగుతోంది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ మీద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు చిరంజీవి. ఖైదీ నంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ వందకోట్ల కలెక్షన్లతో సత్తా చాటాడు. ఈ జనరేషన్ హీరోలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న భారీ కలెక్షన్ రికార్డ్లను సైతం మెగాస్టార్ ఈజీగా అందుకున్నాడు.

సౌత్లో వందకోట్ల సినిమాలు గతంలోనూ ఉన్నా.., చిరంజీవి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు సౌత్లో వందకోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు ఉన్నా, అవన్ని రెండు, మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయి ఆ రికార్డ్ను సాధించాయి.. కానీ కేవలం ఒక్క భాషలోనే రిలీజ్ అయి వందకోట్ల క్లబ్లో చేరిన సినిమాలు మాత్రం చాలా అరుదు అలాంటి అరుదైన రికార్డ్ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగాస్టార్.

Advertisement
 
Advertisement
Advertisement