మమ్ముట్టితో ఇద్దరు అంజలిలు | Meet Anjali Ameer, Mammootty's transgender co-star from his new film | Sakshi
Sakshi News home page

మమ్ముట్టితో ఇద్దరు అంజలిలు

Jan 17 2017 4:18 AM | Updated on Sep 5 2017 1:21 AM

మమ్ముట్టితో ఇద్దరు అంజలిలు

మమ్ముట్టితో ఇద్దరు అంజలిలు

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టితో ఇద్దరు అంజలిలు రొమాన్స్‌ చేస్తున్నారన్నది తాజా సమాచారం. మమ్ముట్టి చాలా గ్యాప్‌ తరువాత కోలీవుడ్‌లో ఒక చిత్రంలో నటిస్తున్నారు.

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టితో ఇద్దరు అంజలిలు రొమాన్స్‌ చేస్తున్నారన్నది తాజా సమాచారం. మమ్ముట్టి చాలా గ్యాప్‌ తరువాత కోలీవుడ్‌లో ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకు ముందు తంగమీన్‌గళ్‌ వంటి ఉత్తమ అవార్డులను అందుకున్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్‌ తాజగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ఇది. వేసవి కాలం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి పేరంబు అనే పేరును నిర్ణయించారు. చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒక కథానాయకిగా అంజలి నటిస్తున్నారు. ఈ అమ్మడు చిన్న గ్యాప్‌ తరువాత నటిస్తున్న తమిళ చిత్రం ఇది. కాగా ఇందులో మరో అంజలి కూడా నాయకిగా నటిస్తుండటం విశేషం. కేరళాకు చెందిన ఈమె పేరు అంజలి అమీర్‌. తను హిజ్రా కావడం మరో విశేషం.

హిజ్రాలు ఇంతకు ముందు పలు చిత్రాల్లో నటించినా మలయాళ చిత్ర పరిశ్రమలో నటించిన తొలి హిజ్రాగా అంజలి అమీర్‌ కీర్తి పొందనున్నారు. ఇప్పటికే పలు మలయాళ చిత్రాల్లో నటించిన అంజలి అమీర్‌కు పేరంబు తొలి తమిళ సినిమా. ఇందులో మమ్ముట్టి సరసన నటించడానికి అంజలి అమీర్‌ మొదట సంకోచించారట. చిత్ర యూనిట్‌ పాజిటీవ్‌ అప్రోచ్‌తో నటించడానికి ముందుకొచ్చారట. ఇప్పుడు మమ్ముట్టితో కలిసి నటించడం సరికొత్త అనుభవం అంటున్నారు. అంతే కాదు ఆయన ప్రోత్సాహం మరువలేనిదని అంజలి అమీర్‌ చెప్పుకొచ్చారు. కాగా పేరంబు చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement