నేర చరిత్ర | Market Movie Opening | Sakshi
Sakshi News home page

నేర చరిత్ర

Dec 25 2018 3:02 AM | Updated on Dec 25 2018 3:02 AM

Market Movie Opening - Sakshi

దివ్య

మూవీ మొఘల్‌ ప్రొడక్షన్స్‌పై అజర్‌ షేక్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మార్కెట్‌’. దాసరి గంగాధర్‌ దర్శకునిగా పరిచయ మవుతున్నారు. కిశోర్, దివ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గంగాధర్‌ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా ఇది నా తొలి సినిమా. నా మీద ఉన్న నమ్మకంతో నిర్మాతకు నన్ను పరిచయం చేసిన రాముగారికి థ్యాంక్స్‌. కథ విషయానికొస్తే ఏ ఊరికైనా నేర చరిత్ర ఉంటుంది.

రాత్రి సమయంలో జరిగే క్రైమ్‌ ఇన్సిడెంట్‌ని తీసుకొని అల్లుకున్న కథ ఇది. ఇప్పటివరకు ప్రపంచం చూడని నేర సామ్రాజ్యాన్ని నా సినిమాలో చూపించబోతున్నా’’  అన్నారు. అజర్‌ షేక్‌ మాట్లాడుతూ– ‘‘నా సినిమా ప్రయాణంలో ఇదే తొలి మెట్టు. గంగాధర్‌ చెప్పిన ఈ కథ నచ్చి నిర్మించడానికి  ఒప్పుకున్నాను. జనవరిలో షూటింగ్‌ ప్రారంభించి మార్చిలో సినిమాని పూర్తి చేస్తాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement