
పెళ్లయితే అంతే!
హీరోయిన్ ఎంత టాలెంటెడ్ అనేది ఇంపార్టెంట్ కాదిక్కడ! పెళ్లైందా? లేదా? అనేది మాత్రమే ఇంపార్టెంట్! ఎంత పెద్ద స్టార్ హీరోయిన్‌కి అయినా పెళ్లైతే ఆటోమేటిక్‌గా ఛాన్సులు తగ్గుతాయంటున్నారు ఇలియానా.
హీరోయిన్ ఎంత టాలెంటెడ్ అనేది ఇంపార్టెంట్ కాదిక్కడ! పెళ్లైందా? లేదా? అనేది మాత్రమే ఇంపార్టెంట్! ఎంత పెద్ద స్టార్ హీరోయిన్‌కి అయినా పెళ్లైతే ఆటోమేటిక్‌గా ఛాన్సులు తగ్గుతాయంటున్నారు ఇలియానా. ‘పెళ్లైన హీరోయిన్లకు సరైన అవకాశాలు రావట్లేదు’ అనే అంశం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అని ఇలియానాను అడి గితే... ‘‘యస్, అఫ్‌కోర్స్. అది నిజమే. ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితి అలాగే ఉంది.
నేను ఆ పరిస్థితిని అంగీకరించి ముందడుగు వేయడం ఓ ఆప్షన్. లేదా జీవితాంతం దాని గురించి ఫైట్ చేస్తుండడం మరో ఆప్షన్. నేను మొదటి ఆప్షన్‌కు ఓటేస్తా. కానీ, అదో చెత్త ఐడియాలజీ. పెళ్లైన కారణంగా ఎంతోమంది టాలెంటెడ్ హీరోయిన్లకు తమ ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదు. మన కళ్ల ముందు అటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. నా వరకు నేను హ్యాపీగా ఉన్నా. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా! ఫిల్మ్ ఇండస్ట్రీపై నాకెలాంటి కంప్లయింట్స్ లేవు’’ అన్నారు.