నన్ను కొత్తగా చూపించారు | Manoj's Shourya to release in January | Sakshi
Sakshi News home page

నన్ను కొత్తగా చూపించారు

Dec 18 2015 11:41 PM | Updated on Sep 3 2017 2:12 PM

నన్ను కొత్తగా చూపించారు

నన్ను కొత్తగా చూపించారు

ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఈ కథ నాకు బాగా నచ్చేసింది.

- మనోజ్
‘‘ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఈ కథ నాకు బాగా నచ్చేసింది. నా కెరీర్‌లోనే డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడు దశరథ్ నన్ను కొత్తగా చూపించారు’’ అని మంచు మనోజ్ చెప్పారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో మనోజ్, రెజీనా జంటగా మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ‘శౌర్య’ చిత్రం మోషన్ పోస్టర్‌ను హీరో మనోజ్ సతీమణి ప్రణతి ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘త్వరలో చిత్రీకరణ పూర్తవుతుంది.

తనకు నచ్చిన అమ్మాయి ప్రేమ కోసం హీరో ఎలా పోరాడాడన్నది చాలా ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాం’’ అని చెప్పారు. ఈ వేడుకలో కథా నాయిక రెజీనా, సంగీత దర్శకుడు వేదా, నటుడు నందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement