కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు | Manmadhudu 2 trailer on July 25 | Sakshi
Sakshi News home page

కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు

Jul 22 2019 3:59 AM | Updated on Jul 23 2019 11:50 AM

Manmadhudu 2 trailer on July 25 - Sakshi

నాగార్జున

ఇంట్లో ఏమీ తెలియని అమాయకుడిలా ఉంటూ బయట మాత్రం మన్మథుడి వేషాలు వేసే ఓ అబ్బాయి.. ఇంట్లో పూజలు చేస్తూ బయట సిగరెట్‌ కాల్చే ఓ అమ్మాయి. ఇలాంటి కొంటె పిల్లాడి జీవితంలోకి వచ్చిన గడసరి అమ్మాయి చేసిన అల్లరి ఏంటి? వీరిద్దరి జీవితాల్లో ప్రేమ చిగురించిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి?... వంటి అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాగార్జున, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటించారు. నాగార్జున, పి. కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇటీవల ఈ సినిమా టీజర్‌ను, రకుల్‌ పోషించిన అవంతిక పాత్ర టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలోని ‘హే మానియా’ పాటను ఆదివారం విడుదల చేశారు. సీనియర్‌ నటి లక్ష్మి, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని, ‘వెన్నెల’ కిశోర్‌ తదితరులు నటించిన ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement