మన్మథుడు మొదలు

Manmadhudu 2 shooting starts on march 25 - Sakshi

సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్లీ మన్మథుడి పాత్రలోకి ఎంట్రీ ఇవ్వడానికి నాగార్జున రెడీ అయ్యారు. 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’లో నటించనున్నారాయన. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 25న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని టాక్‌. ‘చి.ల.సౌ’ చిత్రంతో దర్శకుడిగా మారిన హీరో రాహుల్‌ రవీంద్రన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

రకుల్‌ప్రీత్‌ సింగ్, పాయల్‌రాజ్‌పుత్‌ కథానాయికలు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 4 వరకూ సాగనుందట. ఆ తర్వాత ఏప్రిల్‌ 12కి చిత్రబృందం పోర్చుగల్‌ ప్రయాణం కానున్నారు. ఇందులో నాగార్జున భార్యగా రకుల్‌ ప్రీత్‌ కనిపించనున్నారని టాక్‌. సీక్వెల్‌ కాబట్టి మొదటి పార్ట్‌ కథకు కొనసాగింపుగా ఉంటుందా? లేక అందులోని పాత్రలు మాత్రమే తీసుకుంటారా? వేచి చూడాలి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రిలీజ్‌ కావచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top