చాలెంజింగ్‌ దర్బార్‌ | Manjima Mohan in Tughlaq Darbar Movie | Sakshi
Sakshi News home page

చాలెంజింగ్‌ దర్బార్‌

Aug 7 2019 10:19 AM | Updated on Aug 7 2019 10:19 AM

Manjima Mohan in Tughlaq Darbar Movie - Sakshi

‘తుగ్లక్‌ దర్బార్‌’లోకి తన పేరు రిజిస్టర్‌ చేయించుకున్నారు మలయాళ బ్యూటీ మంజిమా మోహన్‌. విజయ్‌ సేతుపతి హీరోగా ఢిల్లీ ప్రసాద్‌ దీనదయాళ్‌ తెరకెక్కించనున్న సినిమా ‘తుగ్లక్‌ దర్బార్‌’. ఇందులో అదితీరావ్‌ హైదరీ ఒక కథానాయికగా నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మంజిమా మోహన్‌ మరో హీరోయిన్‌గా నటించనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఇందులో విజయ్‌ సేతుపతి రాజకీయ నాయకుడిగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్‌లో ఆరంభం కానుంది. ‘‘విజయ్‌ సేతుపతి వంటి మంచి నటుడితో నటించడానికి నేను ఆసక్తిగాఎదురుచూస్తున్నాను. రొటీన్‌  హీరోయిన్‌ పాత్రలు చేసి బోర్‌ కొట్టింది. ఈ సినిమాలో నా పాత్రనాకు చాలెంజింగ్‌గా ఉంటుందనిచెప్పగలను’’ అన్నారు మంజిమా మోహన్‌.

Advertisement
 
Advertisement
Advertisement