నవాబ్ : అన్నదమ్ముల యుద్ధం!

లెజెండరీ దర్శకుడు మణిరత్నం స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా నవాబ్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. ప్రకాష్ రాజ్ డాన్ తరహా పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
తొలి ట్రైలర్‌లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేసిన నవాబ్ టీం, రెండో ట్రైలర్‌లో కథ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. ట్రైలర్ చూస్తుంటే తండ్రి తరువాత ఆదిపత్యం కోసం అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధమే నవాబ్ కథ అని తెలుస్తోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో జోతిక, ఐశ్వర్యరాజేష్, డయానా ఎర్రప్పలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి