ఎక్స్‌పెక్ట్‌ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ | Mani Ratnam Chekka Chivantha Vaanam to shoot in Dubai | Sakshi
Sakshi News home page

ఎక్స్‌పెక్ట్‌ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌

May 26 2018 12:13 AM | Updated on Oct 9 2018 5:00 PM

Mani Ratnam Chekka Chivantha Vaanam to shoot in Dubai - Sakshi

మణిరత్నం, విజయ్‌ సేతుపతి

...అని తమిళ నటుడు విజయ్‌ సేతుపతి అంటున్నారు. మరి.. ఆ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ విషయం ఎంటో ‘నవాబ్‌’ సినిమాలో చూడాల్సిందే. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్‌ సేతుపతి, అరుణ్‌ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేశ్, అదితీరావ్‌ హైదరీలు ముఖ్య తారలుగా రూపొందుతోన్న సినిమా ‘చెక్కా చివంద వానమ్‌’. తెలుగులో ‘నవాబ్‌’. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను అబుదాబిలో షూట్‌ చేశారట. తాజాగా ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి షూటింగ్‌ పార్ట్‌ పూర్తయ్యింది.

‘‘మణిరత్నంగారితో వర్క్‌ చేయడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. కల నిజమైనట్లుంది. ఎక్స్‌పెక్ట్‌ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ ఇన్‌ ‘నవాబ్‌’’ అన్నారు విజయ్‌ సేతుపతి. రజనీకాంత్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో తన పాత్ర గురించి విజయ్‌ మాట్లాడుతూ –‘‘కార్తీక్‌పై నాకు నమ్మకం ఉంది. ఇంకా స్క్రిప్ట్‌ వినలేదు. రజనీసార్‌తో నటించబోతున్నందుకు హ్యాపీ’’ అన్నారు. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైరా’ చిత్రంలో విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement