‘ఈ నిరీక్షణ భరించలేకపోతున్నా’ | Manchu Vishnu intresting tweet | Sakshi
Sakshi News home page

Dec 30 2017 4:05 PM | Updated on Dec 30 2017 4:05 PM

Manchu Vishnu intresting tweet - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఇప్పటికే మంచు విష్ణు, విరోనికా దంపుతులకు అరియానా, వివియానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరోసారి ఈ దంపతులు కవలలకే జన్మనివ్వనున్నారట. తాజాగా ఈ విషయంపై స్పందించిన మంచు విష్ణు ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. పుట్టబోయే పిల్లల కోసం రెండు జతల పేర్లను సిద్ధం చేసినట్టుగా తెలిపారు. అంతేకాదు ఈ నిరీక్షణ భరించలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు. ప‍్రస్తుతం మంచు విష్ణు... ఆచారి అమెరికా యాత్ర సినిమాతో పాటు తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఓటర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గాయత్రి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement