ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు | Manchu Manoj New Movie with director Ajay | Sakshi
Sakshi News home page

ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు

Jul 1 2016 1:42 PM | Updated on Sep 4 2017 3:54 AM

ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు

ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు

శౌర్య, ఎటాక్ సినిమాలతో నిరాశపరిచిన యంగ్ హీరో మంచు మనోజ్, వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. గత సినిమాల అనుభవంతో రాబోయే సినిమాల విషయంలో...

శౌర్య, ఎటాక్ సినిమాలతో నిరాశపరిచిన యంగ్ హీరో మంచు మనోజ్, వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. గత సినిమాల అనుభవంతో రాబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. యంగ్ హీరోలందరూ కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలో చేస్తుంటే మనోజ్ మాత్రం కొత్తగా ట్రై చేస్తున్నాడు.

ఇప్పటికే సన్నాఫ్ పెదరాయుడు, రాంబో సినిమాల్లో నటిస్తున్న మనోజ్ ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వచ్చాడు. తమిళ సినిమా రావణదేశం కు దర్శకత్వం వహించిన అజయ్ డైరెక్షన్ లో సినిమాను ప్రారంభించాడు. ఈ మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్న మనోజ్, వెంట వెంటనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాలైన మనోజ్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement