-
ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు
శౌర్య, ఎటాక్ సినిమాలతో నిరాశపరిచిన యంగ్ హీరో మంచు మనోజ్, వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. గత సినిమాల అనుభవంతో రాబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. యంగ్ హీరోలందరూ కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలో చేస్తుంటే మనోజ్ మాత్రం కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే సన్నాఫ్ పెదరాయుడు, రాంబో సినిమాల్లో నటిస్తున్న మనోజ్ ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వచ్చాడు. తమిళ సినిమా రావణదేశం కు దర్శకత్వం వహించిన అజయ్ డైరెక్షన్ లో సినిమాను ప్రారంభించాడు. ఈ మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్న మనోజ్, వెంట వెంటనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాలైన మనోజ్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయేమో చూడాలి. -
వివాదాలకతీతంగా 'రావణ దేశం' తెరకెక్కించా: అజయ్
శ్రీలంకలో జరిగిన అంతర్యుద్దంలో తప్పిపోయిన శరణార్థుల కథాంశంతో 'రావణ దేశం' తెరకెక్కించినట్లు ఆ చిత్ర దర్శకుడు అజయ్ నూతక్కి వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఆ చిత్రంలో ఎటువంటి వివాదస్పద అంశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం చెన్నైలో అజయ్ విలేకర్లతో మాట్లాడుతూ... తెలుగు, తమిళలకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఆ చిత్రం రూపొందించలేదన్నారు. 2009లో శ్రీలంకలో జరిగిన అంతర్యుద్దంలోని కొన్ని వాస్తవ సంఘటనల స్పూర్తిగా తీసుకుని ఆ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. శుక్రవారం విడుదల కానున్న ఆ చిత్రం చూసిన ప్రేక్షకుడు మాత్రం ఆనాటి సంఘటనలకు ఎవరో ఒకరు బాధ్యులని భావిస్తాడని ఆయన అభిప్రాపయపడ్డారు. ఆ చిత్రం తెరకెక్కించే క్రమంలో ఆచూకీ తెలియకుండా పోయిన శరణార్థుల అంశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు. అయితే ఆ అంతర్యుద్ధం ముందు ఆ తర్వాత ప్రజల జీవన స్థితిగతులను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆ చిత్రంలోని దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలిపారు. రావణ దేశం చిత్రంలో జన్నీఫర్, రమేష్‌లు నాయికనాయుకులుగా నటించారు. న్యూ అంఫైర్ సెల్యూలాయిడ్ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించింది.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఈ బిచ్చగాడు ఎంత రిచ్ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్!
కారుపై పెద్దపులి దాడి..
టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్..?
హనీరోజ్ 'రాహేలు' టీజర్ విడుదల
సీరియస్‌గా ప్రయత్నించా.. ఎవరూ ఛాన్సివ్వలేదు: సేతుపతి
ఇద్దరూ టెకీలే: క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)
సుమిత్ నగాల్ సంచలనం.. అత్యుత్తమ ర్యాంకు
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'రా రాజా'.. టీజర్‌తోనే భయపెట్టారు!
ఆ దేశం ఇంకా 2016 లోనే ..!ఎందుకో తెలుసా..!
ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
Advertisement