ప్రతినాయకుడిగా మమ్ముట్టి | Mammootty to play villain in Vijay's next? | Sakshi
Sakshi News home page

ప్రతినాయకుడిగా మమ్ముట్టి

Jan 13 2016 2:42 AM | Updated on Sep 3 2017 3:33 PM

ప్రతినాయకుడిగా మమ్ముట్టి

ప్రతినాయకుడిగా మమ్ముట్టి

సీనియర్ హీరోలను విలన్లుగా మార్చడం పరిపాటిగా మారిందనే చెప్పాలి.....

సీనియర్ హీరోలను విలన్లుగా మార్చడం పరిపాటిగా మారిందనే చెప్పాలి.ఇటీవల నటుడు అరవింద్‌సామి తనీఒరువన్ చిత్రంతో విలన్‌గా మారారు. అదే విధంగా సత్యరాజ్, అరుణ్‌విజయ్ లాంటి వారిని ప్రతి నాయకులుగా మార్చేశారు. తాజాగా మలయాళ సూపర్‌స్టార్ కూడా కోలీవుడ్‌లో విజయ్‌కి విలన్ కానున్నారన్నది తాజా సమాచారం.
 
  విజయ్ ప్రస్తుతం తెరి చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, ఎమీజాక్సన్ నాయికలు. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. విజయ్ తన 60వ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్ సంస్థకు చేయనున్నారు. దీనికి భరతన్ దర్శకుడు. కథానాయకిగా కాజల్‌అగర్వాల్ పేరు ప్రచారంలో ఉంది. ఇక పోతే ఇందులో విజయ్‌కు విలన్‌గా బాలీవుడ్ నటుడిని ఎంపిక చేయాలని భావించిన చిత్ర దర్శక నిర్మాతలు ఆ తరువాత దక్షిణాది ప్రముఖ నటుడైతే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.అదీ ప్రతినాయకుడి ఇమేజ్ లేని నటుడైతే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయడంతో మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి అయితే బాగుంటుందని తలచి ఆయన్ని సంప్రదించారట.
 
  కథ విన్న తరువాత మమ్ముట్టి కూడా విజయ్‌కి విలన్‌గా మారడానికి సమ్మతించినట్లు తెలిసింది.అయితే ఆయన అందుకునే పారితోషికం కంటే రెండు రెట్లు అధికంగా చెల్లించనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.కాగా ఇందులో విజయ్‌కు చెల్లెలిగా అమరకావ్యం,ఇండ్రు నేట్రు నాళై ,ఇత్రాల నియకి మియాజార్జ్ నటించనున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement