breaking news
director bharathan
-
ప్రతినాయకుడిగా మమ్ముట్టి
సీనియర్ హీరోలను విలన్లుగా మార్చడం పరిపాటిగా మారిందనే చెప్పాలి.ఇటీవల నటుడు అరవింద్‌సామి తనీఒరువన్ చిత్రంతో విలన్‌గా మారారు. అదే విధంగా సత్యరాజ్, అరుణ్‌విజయ్ లాంటి వారిని ప్రతి నాయకులుగా మార్చేశారు. తాజాగా మలయాళ సూపర్‌స్టార్ కూడా కోలీవుడ్‌లో విజయ్‌కి విలన్ కానున్నారన్నది తాజా సమాచారం. విజయ్ ప్రస్తుతం తెరి చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, ఎమీజాక్సన్ నాయికలు. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. విజయ్ తన 60వ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్ సంస్థకు చేయనున్నారు. దీనికి భరతన్ దర్శకుడు. కథానాయకిగా కాజల్‌అగర్వాల్ పేరు ప్రచారంలో ఉంది. ఇక పోతే ఇందులో విజయ్‌కు విలన్‌గా బాలీవుడ్ నటుడిని ఎంపిక చేయాలని భావించిన చిత్ర దర్శక నిర్మాతలు ఆ తరువాత దక్షిణాది ప్రముఖ నటుడైతే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.అదీ ప్రతినాయకుడి ఇమేజ్ లేని నటుడైతే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయడంతో మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి అయితే బాగుంటుందని తలచి ఆయన్ని సంప్రదించారట. కథ విన్న తరువాత మమ్ముట్టి కూడా విజయ్‌కి విలన్‌గా మారడానికి సమ్మతించినట్లు తెలిసింది.అయితే ఆయన అందుకునే పారితోషికం కంటే రెండు రెట్లు అధికంగా చెల్లించనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.కాగా ఇందులో విజయ్‌కు చెల్లెలిగా అమరకావ్యం,ఇండ్రు నేట్రు నాళై ,ఇత్రాల నియకి మియాజార్జ్ నటించనున్నట్లు సమాచారం. -
కారు ప్రమాదంలో యువహీరోకు తీవ్రగాయాలు
మళయాళ చిత్ర పరిశ్రమలోని యువ నటుడు, దర్శకుడు సిద్ధార్థ భరతన్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం తెల్లవారుజామున ఆయన వెళ్తున్న కారు రోడ్డు పక్కనున్న ఓ గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో చంపక్కర వద్ద జరిగిన ఈ ప్రమాదంలో సిద్దార్థ తలకు తీవ్రగాయమైంది. ఆయనను కొచ్చిలోని మెడికల్ ట్రస్టు ఆస్పత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నా.. స్థిరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రముఖ మళయాళ దర్శకుడు భరతన్, నటి కేపీఏసీ లలితల కుమారుడే సిద్దార్థ. నటులు మమ్ముట్టి, దిలీప్ తదితరులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను చూసివచ్చారు. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, హోం మంత్రి రమేష్ చెన్నితాల ఆస్పత్రికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సిద్దార్థ దర్శకత్వంలో ఈ ఏడాది మొదట్లో దిలీప్ హీరోగా వచ్చిన 'చంద్రెట్టన్ ఎవిడెయ' అనే సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.