జీరోయిజమ్‌ | Mama Rendu Jeggulu movie launch | Sakshi
Sakshi News home page

జీరోయిజమ్‌

Aug 28 2018 12:31 AM | Updated on Aug 28 2018 12:31 AM

Mama Rendu Jeggulu movie launch - Sakshi

జేడీ, సురేశ్‌ పాని

‘‘ప్రేక్షకులు ఇప్పటి వరకు íహీరోయిజమ్‌ చూసి ఉంటారు. కానీ, మా చిత్రంలో జీరో యిజమ్‌  చూస్తారు’’ అని డైరెక్టర్‌ జేడీ అన్నారు. సురేశ్‌ పాని, మేఘన జంటగా జేడీ దర్శకత్వంలో చింతల జెఎస్‌ కుమార్‌ (జోషి) నిర్మిస్తున్న చిత్రం ‘మామ రెండు జెగ్గులు’. ఈ సినిమా ప్రారంభోత్సవంలో డైరెక్టర్‌ సాగర్, నిర్మాత ప్రసన్నకుమార్, కూచిపూడి వెంకట్‌ పాల్గొన్నారు. జేడీ మాట్లాడుతూ– ‘‘ఒక ఊర మాస్‌ అబ్బాయికి, స్వచ్ఛ భారత్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ లాంటి క్లాస్‌ అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ‘మామ’ అంటూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన సురేశ్‌ హీరోగా పరిచయమవుతున్నారు. డిసెంబర్‌లోపు సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement