సుమంత్‌ అన్న మళ్ళీ రావా పెద్ద హిట్‌ అవ్వాలి – అఖిల్‌ | Malli Raava Pre Release Function | Sakshi
Sakshi News home page

సుమంత్‌ అన్న మళ్ళీ రావా పెద్ద హిట్‌ అవ్వాలి – అఖిల్‌

Dec 5 2017 3:25 AM | Updated on Dec 5 2017 3:25 AM

Malli Raava Pre Release Function - Sakshi

‘‘చిన్నప్పుడు నన్ను సుమంత్‌ అన్న చాలా పాంపర్‌ చేసేవారు. ‘మళ్ళీ రావా’ పోస్టర్స్‌లో ఆయన ఫేస్‌లో పెయిన్‌తో చాలా బాగున్నారు. ఈ సినిమా ఆయనకు చాలా పెద్ద హిట్‌ అవ్వాలి. శ్రవణ్‌ ఇచ్చిన పాటలు బాగున్నాయి’’ అని అఖిల్‌ అన్నారు. శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో సుమంత్, ఆకాంక్షా సింగ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్‌ యాదవ్‌ నక్క నిర్మించిన చిత్రం ‘మళ్ళీ రావా’ . ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుకలో హీరో సుమంత్‌ మాట్లాడుతూ– ‘‘అఖిల్‌కి ఈ సినిమా పాటలు బాగా నచ్చాయి. శ్రవణ్‌ మంచి సంగీతం ఇచ్చాడు. నేనిప్పటివరకూ 22 సినిమాలు చేశాను. వాటిలో గోదావరి, గోల్కొండ హైస్కూలు సినిమాలకి చాలా దగ్గరగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘సుమంత్‌ ఈ సినిమా గురించి నాకు చెబుతూనే ఉన్నారు.

ఈ చిత్రంలోని డైలాగులను బట్టి చూస్తే దర్శకుడు తప్పకుండా లవ్‌ మ్యారేజ్‌  చేసుకుని ఉంటారేమో అనిపిస్తోంది. సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు మంచు లక్ష్మి. ‘‘పాటలు బాగా రావడానికి కారణం దర్శకుడు గౌతమ్‌. మధుర శ్రీధర్‌గారు, సుమంత్‌గారు మమ్మల్ని ఎంకరేజ్‌ చేశారు’’ అని సంగీత దర్శకుడు శ్రవణ్‌ చెప్పారు. ‘‘గౌతమ్‌ మంచి స్టోరీ రాసుకున్నారు. చాలా హానెస్ట్‌గా మేం పని చేశాం. అందుకే మంచి అవుట్‌పుట్‌ వచ్చింది’’ అన్నారు నిర్మాత. ‘‘నాకిది మొదటి సినిమా. ఎంతోమందికి నిర్మాతలకు కథ చెప్పినా నన్ను నమ్మి చాన్స్‌ ఇవ్వలేకపోయారు. రాహుల్‌ ముందుకు వచ్చారు. సుమంత్‌ గారు ఇచ్చిన నమ్మకంతోనే బాగా చేయగలిగాను’’ అన్నారు దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement