యుద్ధానికి 30 కోట్లు? | Makers plan Bahubali climax in 30 crores | Sakshi
Sakshi News home page

యుద్ధానికి 30 కోట్లు?

Jun 11 2016 11:13 PM | Updated on Sep 4 2017 2:15 AM

యుద్ధానికి 30 కోట్లు?

యుద్ధానికి 30 కోట్లు?

దాదాపు రెండు నెలలకు పైగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రబృందం షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంది.

దాదాపు రెండు నెలలకు పైగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రబృందం షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంది. ఈ బ్రేక్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేసి, సోమవారం నుంచి షూటింగ్‌తో బిజీ కానున్నారు. క్లైమాక్స్‌లో భాగంగా వచ్చే భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు రాజమౌళి అన్ని సన్నాహాలూ పూర్తి చేశారు. ఈ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ తయారు చేయించారు. నటీనటులకు కూడా శిక్షణ ఇప్పించారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలకు అయ్యే ఖర్చు దాదాపు 30 కోట్ల రూపాయలు అని సమాచారం. తొలి భాగం క్లైమ్యాక్స్‌కి 10 కోట్లు అయిందనే వార్త వినిపించింది. ఇప్పుడు సీక్వెల్ క్లైమ్యాక్స్‌కు అంతకు మూడింతల బడ్జెట్ అంటే.. భారీ స్థాయిలో ఉంటుందని ఊహించవచ్చు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరుల కాంబినేషన్‌లో శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement