కమింగ్‌ సూన్‌ | Makers non-committal about 'Touch Chesi Chudu' release date | Sakshi
Sakshi News home page

కమింగ్‌ సూన్‌

Jan 19 2018 12:18 AM | Updated on Jan 19 2018 12:18 AM

Makers non-committal about 'Touch Chesi Chudu' release date - Sakshi

టచ్‌ చేస్తాం. అతి త్వరలో మాంచి మాస్‌ బొమ్మతో థియేటర్స్‌ను టచ్‌ చేస్తాం అంటున్నారు ‘టచ్‌ చేసి చూడు’ చిత్రబృందం. రవితేజ హీరోగా విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టచ్‌ చేసి చూడు’. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు.

ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని సమాచారం. ‘‘చిరకాల మిత్రుడైన రవితేజతో సినిమా చేయడం  ఆనందంగా ఉంది. వక్కంతం వంశీ అందించిన కథను విక్రమ్‌ బాగా తెరకెక్కించారు. త్వరలో సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రీతమ్‌ అండ్‌ జామ్‌ 8 సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement