మళ్లీ బుల్లితెరవైపు మహేశ్ భట్ చూపు | Mahesh Bhatt wants to make TV show with fresh content | Sakshi
Sakshi News home page

మళ్లీ బుల్లితెరవైపు మహేశ్ భట్ చూపు

Dec 26 2013 10:26 PM | Updated on Apr 3 2019 6:23 PM

మళ్లీ బుల్లితెరవైపు మహేశ్ భట్ చూపు - Sakshi

మళ్లీ బుల్లితెరవైపు మహేశ్ భట్ చూపు

అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు బుల్లితెరపై ప్రత్యక్షమవుతూ ఇంటిల్లిపాదిని చూపుతిప్పుకోనీయకుండా చేస్తుంటే

అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు బుల్లితెరపై ప్రత్యక్షమవుతూ ఇంటిల్లిపాదిని చూపుతిప్పుకోనీయకుండా చేస్తుంటే దర్శక నిర్మాత మహేశ్ భట్ చూపు కూడా మరోసారి బుల్లితెరవైపు మళ్లింది. ఇప్పటికే భట్ ‘ఎ మౌత్‌ఫుల్ ఆఫ్ స్కై’ ఇంగ్లిష్ షో ద్వారా బుల్లితెరపై తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అంతేకాక ‘స్వాభిమాన్’ వంటి సీరియల్‌ను తెరకెక్కించి కుటుంబాన్ని మొత్తం టీవీ ముందు కట్టిపడేశాడు. అనురాగ్ కశ్యప్ రాసిన ‘కభీ కభీ’కి దర్శకత్వం వహించి, బుల్లితెరపై తానెవరికీ తీసిపోనని నిరూపించుకున్నాడు. 
 
 అయితే తాజాగా మరోసారి బుల్లితెర ప్రేక్షకులకు తన మాయాజాలాన్ని చూపాలనుకుంటున్నాడు మహేశ్ భట్. సరికొత్త ఆలోచనతో వచ్చే సంవత్సరం ఓ టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు. ‘24’ షో ద్వారా ప్రముఖ నటుడు అనిల్ కపూర్ టీవీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. బచ్చన్ కూడా ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’తో సంచలనాలే సృష్టించాడు. అయితే వీటిని మించి ప్రేక్షకాదరణ పొందే ఓ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తన షో ఎలా ఉంటుంది? ఎవరెవరు అందులో పాత్రధారులు కానున్నారు? అసలు తన ఆలోచన ఏంటి? ఎవరిని లక్ష్యంగా చేసుకొని షోను ప్లాన్ చేస్తున్నారు? తదితర వివరాలేవీ తాను ఇప్పుడు వెల్లడించలేనని,
 
 అయితే షోను స్టార్ చానల్‌లో ప్రసారం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పాడు. అయితే కుటుంబాన్ని మొత్తం అలరించేలా తన షో ఉంటుందని, టీవీ మాధ్యమానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో మరోసారి ఇటువైపు చూడాల్సి వస్తోందన్నాడు. షోకు సంబంధించి కూడా సాంకేతిక నిపుణులు, ఇతరులు కొందరితో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో కొలిక్కి వచ్చే అవకాశముందని, అవి పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు. మొత్తానికి 2014లో ఓ కొత్త టీవీ షో మనల్ని అలరించనుందన్నామాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement