మహేష్‌ వరుసబెట్టి ఇచ్చేశాడు | Mahesh Bharat Anu Nenu first look Poster out | Sakshi
Sakshi News home page

స్టన్నింగ్‌ అవతారంలో సూపర్‌ స్టార్‌

Jan 26 2018 11:07 AM | Updated on Apr 23 2018 10:19 AM

Mahesh Bharat Anu Nenu first look Poster out - Sakshi

సాక్షి, సినిమా : గణతంత్ర్య దినోత్సవ కానుకగా ‘భరత్‌... అను నేను’ పేరిట ఆడియో బిట్‌ను విడుదల చేసిన దర్శకుడు కొరటాల శివ మరికాసపేటికే ఇంకో ట్రీట్‌ ఇచ్చేశాడు. టైటిల్‌ లోగోతోపాటు మహేష్‌ లుక్కును కూడా రివీల్‌ చేస్తూ ఓ పోస్టర్‌ వదిలాడు. 

స్టైలిష్‌ అవతారంలో సీరియస్‌గా బ్యాగ్‌ పట్టుకుని ఆఫీస్‌లో నడుచుకుంటూ బయటకు వస్తున్న మహేష్‌ పోస్టర్‌ స్టన్నింగ్‌ గా ఉంది. ముఖ్యమంత్రి ఛాంబర్‌తో ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌ థీమ్‌ కూడా బాగుంది. ఇక ఇంతకాలం ఊరిస్తూ వస్తూ... మేకర్లు ఇప్పుడు ఒక్కోక్కటిగా వరుసపెట్టి వదులుతుండటంతో సూపర్‌ స్టార్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం భరత్‌ అను నేను యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ప్రమోషన్లలో కూడా కాస్త వైవిధ్యం కనిపిస్తుండటం విశేషం. కొరటాల శివ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న భరత్‌ అను నేను... ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement