స్మాల్‌ శాంపిల్‌ మాత్రమే

Mahesh Babu's wax statue in progress, early insights look undistinguishable - Sakshi

లండన్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ మధ్య మహేశ్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు. దానికి సంబంధించిన కొలతలను, వివరాలను తుస్సాడ్స్‌ టీమ్‌ మెంబర్స్‌కు ఇచ్చారు మహేశ్‌. ఇప్పుడు ఆ మైనపు విగ్రహం కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నారు మేడమ్‌ తుస్సాడ్స్‌ నిర్వాహకులు. మహేశ్‌ బాబు విగ్రహం ఎలా ఉంటుందో? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిన్న టీజర్‌ చూపించారు మేడమ్‌ తుస్సాడ్స్‌వారు.

చిన్న లుక్‌ను గురువారం రిలీజ్‌ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. ఈ  బొమ్మను శిల్పి ఇవాన్‌ రీస్‌ తయారు చేస్తున్నారట. త్వరలోనే పూర్తి స్థాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మ్యూజియం బృందం తెలిపింది. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ  సినిమా చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను మహేశ్‌ బర్త్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 9న రిలీజ్‌ చేయనున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో స్టార్ట్‌ కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top