శ్రీమంతుడు టీజర్ విడుదల | mahesh babu's srimanthudu teaser released | Sakshi
Sakshi News home page

శ్రీమంతుడు టీజర్ విడుదల

May 31 2015 9:26 AM | Updated on Sep 3 2017 3:01 AM

శ్రీమంతుడు టీజర్ విడుదల

శ్రీమంతుడు టీజర్ విడుదల

ప్రిన్స్‌ మహేష్‌బాబు అప్‌కమింగ్‌ మూవీ శ్రీమంతుడు టీజర్‌ ను ఆదివారం రిలీజ్‌ చేశారు. హీరో కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఈ టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

ప్రిన్స్‌ మహేష్‌బాబు అప్‌కమింగ్‌ మూవీ శ్రీమంతుడు టీజర్‌ ను ఆదివారం రిలీజ్‌ చేశారు. హీరో కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఈ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీమంతుడు మూవీపై మహేష్‌ అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మిత్రులు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్‌లు సమష్టిగా ‘మిర్చి’ ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘ఆగడు’ తర్వాత చాలాకాలంగా తెరపై కనిపించని మహేశ్ ఫస్ట్‌లుక్‌కు సహజంగానే అభిమానుల నుంచి విశేషస్పందన లభించింది. ఇప్పుడు టీజర్ ను కూడా రిలీజ్ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

Advertisement
 
Advertisement
Advertisement