ప్రజలను ప్రేమించే సీఎం! | Mahesh Babu's Bharat Ane Nenu Leaked Pic | Sakshi
Sakshi News home page

ప్రజలను ప్రేమించే సీఎం!

Oct 7 2017 1:32 AM | Updated on May 10 2018 12:13 PM

Mahesh Babu's Bharat Ane Nenu Leaked Pic - Sakshi

అతడు ప్రజలను పాలించడానికి మాత్రమే కాదు.. ప్రేమించడానికి సీఎం అయ్యాడు. ప్రతిపక్షాలు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పే యంగ్‌ సీయం రాబోతున్నాడు. మహేశ్‌ అభిమానులు తమ హీరో క్యారెక్టరైజేషన్‌ గురించి ఇలా ఓ రేంజ్‌లో చెప్పుకుంటున్నారు. కొరటాల శివ దర్శత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. డివీవీ దానయ్య నిర్మాత.

ఇందులో మహేశ్‌బాబు సీయంగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్టిల్‌ ఒకటి సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యింది. దీంతో మహేశ్‌ లుక్‌ రివీలైంది. లీకైన స్టిల్‌లో యంగ్‌ సీయంలా మహేశ్‌ సూపర్‌గా ఉన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈలోపు స్టిల్‌ బయటకు రావడం చిత్రబృందాన్ని బాధపెట్టింది.

మా కష్టాన్ని వృథా చేయవద్దు
‘‘లీకైన మా సినిమా స్టిల్‌ను సర్క్యులేట్‌ చేయొద్దని నెటిజన్లను, ఇతర మీడియా వారిని రిక్వెస్ట్‌ చేస్తున్నాను. ఇలాంటివి చేయడం వల్ల మా అందరి కష్టాన్ని వృథా చేసినట్లు అవుతుంది. మేం మంచి అవుట్‌పుట్‌ ఇవ్వడానికి మా వంతు కృషి చేస్తున్నాం’’ అని చిత్రదర్శకుడు కొరటాల శివ విన్నవించుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement