నేను మాస్కు ధరించా.. మరి మీరు: మహేశ్‌

Mahesh babu Twitted To The People that Importance Of Wearing Mask - Sakshi

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా బయటకు వస్తున్న ప్రజలు తప్పకుండా మాస్కు ధరించాలని టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు కోరారు.  కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇటీవల లాక్‌డౌన్‌-4లో కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి చేరుతున్నారు. ఈ క్రమంలో కరోనాను దరిచేరకుండా ఉంచేందుకు మాస్కు ధరించడం ఎంత అవసరమో మహేశ్‌ తన అభిమానులకు వివరించారు. ఈమేరకు ట్విటర్‌ ద్వారా విలువైన సూచనలు అందించారు. లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా తిరిగి సాధారణ జీవితంలోకి అడుగుపెడుతున్నారని, ఈ సమయంలో కరోనా వ్యాప్తి చేందే అవకాశం ఎక్కువగా ఉన్నందున తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని మహేశ్‌ సూచించారు. (కేసీఆర్‌కు ధన్యవాదాలు: చిరంజీవి )

‘‘మళ్లీ మనం సాధారణ జీవితంలోకి అడుగుపెడుతున్నాం. ఇది కాస్తా నెమ్మదిగా కావచ్చు. కానీ తప్పకుండా సాధారణ పరిస్థితుల్లోకి వస్తాం. ఈ సమయంలో మాస్కు ధరించడం తప్పనిసరి. గుర్తు పెట్టుకోండి, ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసరి మాస్కు ధరించండి. కనీసం ఇలా చేయడం వల్ల అయినా మనల్ని మనం కాపాడుకోవడంతోపాటు ఇతరులను సురక్షితంగా ఉంచవచ్చు. మాస్కు ధరించడం వల్ల మరోలా కనిపించవచ్చు. కాని ఇది చాలా అవసరం. ఖచ్చితంగా మనం దీనిని అలవాటు చేసుకోవాలి. దీనిని స్వీకరించి కొత్తగా తిరిగి సాధారణ జీవితాన్ని ప్రారంభిద్ధాం. నేను మాస్కు ధరించా.. మరి మీరు?’’ అంటూ ప్రిన్స్‌ మహేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. (దుల్కర్‌కు జోడిగా బుట్టబొమ్మ!)

మహేశ్‌ జిమ్‌ బాడీ చూసి ఫ్యాన్స్‌ ఫిదా!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top