తమిళ్లో సూపర్ స్టార్ ఓన్ డబ్బింగ్ | Mahesh babu to dub him self in tamil version of murugadoss film | Sakshi
Sakshi News home page

తమిళ్లో సూపర్ స్టార్ ఓన్ డబ్బింగ్

Sep 10 2016 12:28 PM | Updated on Jul 23 2019 11:50 AM

తమిళ్లో సూపర్ స్టార్ ఓన్ డబ్బింగ్ - Sakshi

తమిళ్లో సూపర్ స్టార్ ఓన్ డబ్బింగ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయక పాత్రలో అలరించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త సూపర్ స్టార్ అభిమానులకు కిక్ ఇస్తోంది.

ఇటీవల మహేష్ హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలు తమిళ నాట కూడా భారీగా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల తమిళ వర్షన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్తో మహేష్ పాత్రకు డబ్బింగ్ చెప్పించారు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మాత్రం తమిళ వర్షన్కు కూడా మహేష్ స్వయంగా డబ్బింగ్ చెప్పాలని భావిస్తున్నాడట. చెన్నైలోనే పుట్టి పెరిగిన ప్రిన్స్ తమిళంలో బాగా మాట్లాడగలడు. అందుకే మహేష్ సొంత గొంతుతో డబ్బింగ్ చెపితే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement