మహేష్‌ కొత్త లుక్‌ ఎప్పుడంటే..! | Mahesh Babu New Look On June 10th | Sakshi
Sakshi News home page

Jun 5 2018 1:07 PM | Updated on Jun 5 2018 2:22 PM

Mahesh Babu New Look On June 10th - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు ఇన్నేళ్ల కెరీర్‌లో లుక్‌ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయలేదు. అందుకే తన 25వ సినిమాలో కొత్త లుక్‌ లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు సూపర్‌ స్టార్‌. ఇప్పటికే లుక్‌ విషయంలో మహేష్ కసరత్తులు చేస్తున్నాడు. అయితే మహేష్ కొత్త లుక్‌ త్వరలోనే రివీల్‌ కానుందన్న టాక్‌ వినిపిస్తోంది. జూన్‌ పదిన జరగనున్న డబ్బింగ్ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో మహేష్ పాల్గొననున్నారట.

అంతేకాదు సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న సమ్మెహనం సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు కూడా మహేష్ హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో మహేష్‌ కొత్త లుక్‌ చూసేందుకు అభిమానులు జూన్‌ 10 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్‌ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే కొత్త సినిమా పనుల్లో బిజీ కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement