టైటిల్ ఫైనల్ చేసిన మహేష్ మూవీ టీం..? | mahesh babu murugadoss movie title Abhimanyu | Sakshi
Sakshi News home page

టైటిల్ ఫైనల్ చేసిన మహేష్ మూవీ టీం..?

Mar 8 2017 10:34 AM | Updated on Sep 5 2017 5:33 AM

టైటిల్ ఫైనల్ చేసిన మహేష్ మూవీ టీం..?

టైటిల్ ఫైనల్ చేసిన మహేష్ మూవీ టీం..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్న

సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నా.. ఇంత వరకు టైటిల్, ఫస్ట్ లుక్లను రిలీజ్ చేయలేదు. కానీ మహేష్ మూవీ టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు తెరమీదకు వచ్చాయి. ఏజెంట్ శివ, సంభవామి, ఎనిమీ, మర్మం లాంటి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ మూవీ టైటిల్ విషయంలో చిత్రయూనిట్ ఒక నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ కౌంటర్ టెర్రరిజం ఆఫీసర్ అభిమాన్యుగా నటిస్తున్నాడు మహేష్. అందుకే సినిమాలో మహేష్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్గా పెడితే బెటర్ అని భావిస్తున్నారట. అభిమన్యు అనే టైటిల్ అయితే పవర్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఒకే టైటిల్తో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే టైటిల్ను ఫైనల్ చేసి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement