మహేష్ మూవీ వాయిదా పడుతుందా..? | Mahesh Babu, Murugadoss Movie release May postpone | Sakshi
Sakshi News home page

మహేష్ మూవీ వాయిదా పడుతుందా..?

Sep 29 2016 10:34 AM | Updated on Sep 4 2017 3:31 PM

మహేష్ మూవీ వాయిదా పడుతుందా..?

మహేష్ మూవీ వాయిదా పడుతుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2017 వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అది కూడా...

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2017 వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అది కూడా మహేష్ కెరీర్లో బిగెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచి పోకిరి రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 28ననే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఇప్పుడు అదే సమయానికి మహేష్ మూవీ రిలీజ్ అవుతుందా.. లేదా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి 2ను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో మహేష్ తన సినిమాను వాయిదా వేసుకోక తప్పేలా లేదు. గతంలో కూడా బాహుబలి తొలి భాగం రిలీజ్ సమయంలో తన శ్రీమంతుడు సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేశాడు మహేష్. మరి మరోసారి అదే బాటలో వాయిదా వేస్తాడా..? లేక బాహుబలి కన్నా ముందే థియేటర్లలోకి వస్తాడా..? చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement