ఫ్యాన్‌ మూమెంట్‌ | Mahesh Babu is fanboy moment with cricket legend Andy Roberts | Sakshi
Sakshi News home page

ఫ్యాన్‌ మూమెంట్‌

Jun 14 2019 1:02 AM | Updated on Jun 14 2019 1:02 AM

Mahesh Babu is fanboy moment with cricket legend Andy Roberts - Sakshi

ఆండీ రాబర్ట్స్, మహేశ్‌బాబు

హీరో మహేశ్‌బాబుకు ఫ్యాన్స్‌ నంబర్‌ ఇంత అని చెప్పలేం. ఎప్పటికప్పుడు ఆ నంబర్‌ అప్‌డేట్‌ అవుతూ పెరుగుతూ ఉంటుంది. అంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న మహేశ్‌ తానే అభిమానిలా మారిపోయి వెస్టిండీస్‌ క్రికెటర్‌ ఆండీ రాబర్ట్స్‌తో ఫొటో దిగారు. ప్రస్తుతం మహేశ్‌ హాలిడే మూడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే లండన్‌లో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను లైవ్‌లో మహేశ్‌ వీక్షించిన సంగతి గుర్తుండే ఉంటుంది. సో.. మహేశ్‌ అక్కడే ఈ ఫొటో దిగి ఉండవచ్చు. ఇక.. ఈ ఫారిన్‌ ట్రిప్‌ కంప్లీట్‌ కాగానే ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా షూట్‌లో జాయిన్‌ అవుతారు మహేశ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement